స్వీడన్‌లో ఆఫీసులు ఇలా ఉంటాయా?.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
- స్వీడన్‌లోని తన ఆఫీసు వీడియోను పంచుకున్న భారతీయ ఉద్యోగి
- క్యూబికల్స్ లేకుండా ఓపెన్ డిజైన్‌తో ఆకట్టుకుంటున్న కార్యాలయం
- ఉచిత క్యాండీలు, మసాజ్ చైర్లు, గేమ్స్‌తో ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు
- ఆఫీసు పని వాతావరణం చాలా రిలాక్స్‌గా ఉంటుందని వెల్లడి
యూరప్‌లో పనిచేస్తున్న ఓ భారతీయ నిపుణుడు తన కార్యాలయం గురించి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్వీడన్‌లోని కార్పొరేట్ కార్యాలయాల్లో పని సంస్కృతి, ఉద్యోగులకు కల్పించే సౌకర్యాలు ఎలా ఉంటాయో చూపిస్తూ ఆయన ఈ వీడియోను పోస్ట్ చేశారు. పర్యావరణ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న సంకేత్ బనిక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో, సంప్రదాయ ఆఫీసులకు పూర్తి భిన్నమైన పని వాతావరణాన్ని కళ్లకు కట్టింది.
ఆఫీసు వాతావరణం చాలా రిలాక్స్‌గా ఉంటుందని, అది ఒక పని ప్రదేశంలా అనిపించదని సంకేత్ తన వీడియోలో వివరించారు. సాధారణ ఆఫీసుల్లో కనిపించే క్యూబికల్స్ పద్ధతి ఇక్కడ లేదని, దానికి బదులుగా ఓపెన్ డిజైన్‌తో కూడిన ఆధునిక ఏర్పాట్లు ఉన్నాయని చూపించారు. ఉద్యోగులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు బీన్ బ్యాగులు, స్టైలిష్ కుర్చీలు, టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ డిజైన్ కారణంగా ఆఫీస్‌లో ఉన్నామనే ఫార్మల్ ఫీలింగ్ తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆఫీసులోని మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఉద్యోగులు ఆఫీసులోని మెట్లపై కూర్చుని కూడా పనిచేసుకునే వెసులుబాటు ఉంది. అంతేగాక ఒకేచోట కూర్చోవడం విసుగు అనిపిస్తే, ఆఫీసు బయటకు వెళ్లి ప్రకృతి మధ్యలో కూర్చుని కూడా పని పూర్తి చేయవచ్చని సంకేత్ తెలిపారు.
ఉద్యోగుల సంక్షేమానికి ఇక్కడి యాజమాన్యాలు పెద్దపీట వేస్తాయని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. ఆఫీసులో అందరికీ అపరిమితంగా, ఉచితంగా క్యాండీలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతిరోజూ సాయంత్రం స్వీడిష్ తరహా స్నాక్స్ కూడా అందిస్తారట. పని ఒత్తిడి ఎక్కువగా అనిపించినప్పుడు సేదతీరేందుకు మసాజ్ చైర్లను వాడుకోవచ్చని, అలాగే ఆఫీసులోనే గేమ్స్ ఆడుకునే సౌకర్యం కూడా ఉందని ఆయన వివరించారు.
"యూరప్‌లోని కార్పొరేట్ ఆఫీసులు చాలా మంచి వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను అందిస్తాయి. ఈ బ్యాలెన్స్ ఇక్కడి రోజువారీ ఆఫీస్ జీవితంలో నిజంగా అనుభవించవచ్చు" అనే క్యాప్షన్‌తో సంకేత్ ఈ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఇలాంటి పని వాతావరణం ఉంటే ఉత్పాదకత మరింత పెరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.